ట్విట్టర్ లో నారా లోకేష్ ...
అమరావతి : వైకాపా అధికారంలో ఉందని మరిచిపోయారా?
విత్తనాలో జగన్ ప్రభో అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే!
చంద్రబాబు వల్లే విత్తనాలు ఇవ్వలేకపోతున్నామంటున్నారు.
ఒకటో తారీఖుకొచ్చే పింఛను రాలేదేమని పండుటాకులు నిలదీస్తే!
గత ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని సమాధానం ఇస్తున్నారు.
బీమా రాలేదు..మా బతుకుల ధీమా ఏదీ అంటే!
తెలుగుదేశం సర్కారు వల్లే అంటూ మాట దాటవేస్తున్నారు.
నేను విన్నాను..నేను ఉన్నానంటూ సీఎం అయ్యి, పాలన చేతకాక..ఇప్పుడు
చంద్రబాబే వింటాడు..చంద్రబాబే ఉంటాడు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వెలగబెడుతున్నది వైకాపానా? తెదేపానా?
Comments
Post a Comment