నేడు, రేపు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు
అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ, రేపు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో అసెంబ్లి కమిటీ హాల్‌లో తరగతులు నిర్వహించనున్నారు.
శాసనసభ వ్యవహారాలు, విధివిధానాలపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
అసెంబ్లి సాంప్రదాయాలు, నియమాలు సభ్యులందరికీ తెలియజేస్తామని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.
దేశంలో విశిష్టమైన వ్యక్తులతో శాసనసభ్యులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
శాసనసభ పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం కలిగేలా చేస్తామని పేర్కొన్నారు.
Comments
Post a Comment