మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి

ముంబై : మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గోడ కూలిన ఘటనలపై ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముంబై, పుణె, థానేలో గోడలు కూలి 25 మంది మృతి చెందారు.

ఈ మూడు ఘటనల్లో 80 మందికి పైగా గాయాలయ్యాయి. మలాడ్‌ ఈస్ట్‌ ప్రాంతంలో గోడ కూలి 16 మంది, పుణెలో ఆరుగురు, థానే జిల్లా కల్యాణ్‌లో ముగ్గురు మృతి చెందారు.

శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

మరో 48 గంటలపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

మలాడ్‌ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మలాడ్‌ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌.

గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?