దివ్యాంగుల వివాహ పరిచయ వేదిక
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్త దివ్యాంగుల వివాహ పరిచయ వేదికను ఈ నెల 7వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్టు మహేష్ కురుమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
శాంతి దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల వివాహ పరిచయ వేదికను కాజీపేట(వరంగల్)లోని ఫాతిమ చర్చి కాంపౌండ్‌లో ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నామని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్ పేర్కొన్నారు.
పెళ్లి కాని దివ్యాంగులు తమ సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్‌లు, ఒక ఫుల్ ఫొటో పట్టుకొని రావాలన్నారు.
ఈ విషయాన్ని దివ్యాంగులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మరిన్ని వివరాల కొరకు ఫోన్ నెం: 9848942202 (వాట్సాప్)లో సంప్రదించాలన్నారు.
Comments
Post a Comment