రైతుల కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
అనంతపురం
జిల్లాలో వేరుశనగ విత్తనం కోసం రైతుల కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
విత్తన పంపిణీలో జాప్యంపై అధికారుల తీరును నిరసిస్తూ..... ఉరవకొండలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
ఉరవకొండ - గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
ఐదు గ్రామాలకు చెందిన రైతులకు విత్తన పంపిణీ చేస్తామని చెప్పిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తోపులాట జరిగిందని, పంపిణీ సరిగా జరగలేదని రైతు సంఘం నాయకులు తెలిపారు.
పోలీసులు..... రైతులందరికీ విత్తన పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాక ఆందోళన విరమించారు.
Comments
Post a Comment