విధివ్రాత పై ఈమాన్ (విశ్వాసం) కలిగి ఉండాలి.

బ్రదర్ నజీర్

మంగళగిరి

విధివ్రాతను ప్రతి ఒక్కరూ నమ్మాల్సిందేనని, విధివ్రాతను నమ్మడం ఈమాన్ (విశ్వాసం)లో ఒక భాగమని అని బ్రదర్ నజీర్ అన్నారు.

మంగళగిరి మండలంలోని యర్రబాలెం గ్రామంలోని మసీద్ ఎ హుదాలో శుక్రవారం  ఈమాన్ (విశ్వాసం) అనే అంశంపై బ్రదర్ నజీర్  జుమా ఖుత్భా ప్రసంగం చేసారు. 

విశ్వాసం మూల సూత్రాలు ప్రధానంగా ఆరు భాగాలన్నారు.  

అల్లాహ్, దైవదూతలు, దైవగ్రంథాలు, దైవ ప్రవక్తలు, విధివ్రాత,పరలోక జీవితం.  వీటన్నింటినీ నమ్మడమే ఈమాన్ అని చెప్పారు. 

ఒక వ్యక్తి విశ్వాసి అవునా?కాదా? అనే విషయం అతని ప్రాపంచిక జీవిత కార్యకలాపాలను పరిశీలించినప్పుడు మాత్రమే తెలుస్తుందన్నారు. 

తెల్లటి దుస్తులు ధరించి గడ్డాలు పెంచినంత మాత్రాన ఈమాన్ కలిగి ఉన్నట్లు కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. 

నేటి కాలంలో ప్రజలు ఎంత సేపటికీ   నేను, నాభార్య, నా పిల్లలు అని ఆలోచిస్తున్నారే తప్ప సమాజంలోని తోటి ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

పైగా  తోటివారిపట్ల కోపాన్ని,ద్వేషాన్ని పెంచుకుంటూ స్వలాభం కోసమే ఆరాట పడుతున్నారని చెప్పారు.

అయితే  అల్లాహ్ కోసం కోపాన్ని,ద్వేషాన్ని విడనాడాలని, లేకుంటే  అప్పటి వరకూ మీరు చేసుకున్న పుణ్యాలు కోల్పోయినట్లేనన్నారు.

ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు,భార్యా బిడ్డలతో పాటు ఇరుగు పొరుగు వారిపట్ల ప్రేమగా మెలగాలని చెప్పారు.

విశ్వ ప్రవక్తల అధినేత ప్రవక్త స.అ.స. ఆయన శిష్యులు (సహాబాలు) జీవితాలను అధ్యయనం చేసి ఇస్లాం కోసం వారు  చేసిన త్యాగాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరిలో దైవంపట్ల, దైవగ్రంథాల పట్ల,పరలోక జీవితం పట్ల, విధివ్రాత పట్ల  ఈమాన్ (విశ్వాసం) మరింతగా పెరుగుతుందని చెప్పారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?