ఖాట్మండు (నేపాల్) :

నేపాల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.

గడచిన 24 గంటల్లో అతి భారీవర్షాలు కురవడంతో వరదనీటి ధాటికి 21 మంది మరణించారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు.

వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారీ వర్షాలు నేపాల్ దేశంలోని 20 జిల్లాల్లోని పలు ప్రాంతాలను జలమయం చేసింది.

పాత ఇళ్లు కూలిపోయి జనం మరణిస్తున్నందున ప్రజలు శిథిల భవనాలను ఖాళీ చేయాలని ఆదేశించింది.

ఖాట్మండు నగరంలోని పలు ప్రాంతాల్లో రబ్బరు బోట్లను రంగంలోకి దించారు. కోసి నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది.

వచ్చే రెండు రోజులపాటు నేపాల్ లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేపాల్ సర్కారు కోరింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?