కుప్పంలో ఉద్రిక్తత...వైసీపీ,టీడీపీ మధ్య ఘర్షణ
ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు... కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.దీంతో ఆ పార్టీ నేతలు చంద్రబాబు టూర్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంతో గతరాత్రి కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో గొడవ తలెత్తింది. ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధికి సంబంధించిన బ్యానర్లను.. ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు పెడుతుండగా.. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీ సీఎం జగన్ బ్యానర్ల ముందు వాటిని ఏర్పాటు చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు... నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ కాస్త ముదిరి ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దిగారు. దీంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు, రామకుప్పం, గుడుపల్లె ఎస్సైలు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, వైసీపీ బ్యానర్లకు అడ్డంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించే వరకు కదిలేది లేదని వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు పర్యటన ముగిసిన వెంటనే తామే దగ్గరుండి తొలగిస్తామని పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు తొలగించే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Comments
Post a Comment