ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులు వివరంగా

న్యూదిల్లీ:

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయని ఆమె, తొలిసారి గృహ రుణం తీసుకుని ఇల్లు కట్టుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.1 పెంచుతున్నట్లు తెలిపిన ఆమె, బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని 10శాతం నుంచి 12.50శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. తాజా బడ్జెట్‌ వివిధ వస్తువుల ధరలపై ప్రభావ చూపనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులివి!
ధరలు పెరిగే వస్తువులు ఇవే!
* బంగారం
* పెట్రోల్‌ డీజిల్‌ 
* ఏసీలు
* స్టోన్‌ క్రషింగ్‌ ప్లాంట్‌లు
* సీసీ కెమెరాలు 
* స్పీకర్లు
* డిజిటల్‌ వీడియో రికార్డర్లు
* ఆటో మొబైల్‌లో వినియోగించే
షీట్లు, రోల్స్‌, డిస్క్‌లు, ప్యాడ్‌లు
* కార్ల అద్దాలు, రేర్‌ వ్యూ గ్లాస్‌
* మోటార్‌ బైక్‌లకు వేసే తాళాలు
* ఆయిల్‌/ఎయిర్‌ ఫిల్టర్‌లు
* బైక్‌ హార్న్‌లు
* లైటింగ్‌ సిస్టమ్‌
* కార్ల విండో స్క్రీన్‌ వైపర్‌
* సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు నిధి పన్ను
* జీడి పిక్కలు
* సబ్బులు
* ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ కవర్లు 
* రబ్బరు
* టైర్లు
* న్యూస్‌ ప్రింట్‌
* మ్యాగజైన్లు
* దిగుమతి చేసుకునే పుస్తకాలు 
* ఆప్టికల్ ఫైబర్‌ కేబుళ్లు
* సిరామిక్‌ టైల్స్‌
* స్టెయిన్‌లెస్‌ స్టీల్‌
* అలాయ్‌ స్టీల్‌ వైర్‌
* మెటల్‌ ఫర్నిచర్‌ 
* పీవీసీ పైపులు
ఇవి తగ్గుతాయి...
* గృహ రుణాలు
* రక్షణ సామగ్రి
* నాఫ్తా
* సెల్‌ఫోన్‌ ఛార్జర్లు
* సెట్‌టాప్‌ బాక్సులు 
* మొబైల్‌ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు
* ఎలక్ట్రిక్‌ కారులు, బైక్‌లు, ఛార్జింగ్‌ సైకిళ్లు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?