సమంత అక్కినేనిపై కే రాఘవేంద్రరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
సమంతకు పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇంకా మాట్లాడితే పెరిగింది.. పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ దర్శకులు ఆమె కోసం కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నారు.. ఓకే అంటే ఏడాదంతా సినిమాలు చేస్తూనే ఉంటుంది సమంత అక్కినేని. ప్రస్తుతం ఈమె నటించిన ఓ బేబీ సినిమా జులై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి చాలా మంది సినిమా పెద్దలు కూడా వచ్చారు. వెంకటేష్ సహా ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. అందులో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కూడా ఉన్నారు.
ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు సమంత అక్కినేనిపై మనసు పడ్డాడు. మనసు పడటం అంటే ఆమె నటనకు ఫిదా కావడం అన్నమాట. మనసులో ఉన్నదున్నట్లు చెప్పేస్తుంటాడు ఈ దర్శకుడు. మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మనసులో ఏదీ దాచుకోవడం లేదు మౌనముని. ఇప్పుడు ఓ బేబీ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా దర్శకేంద్రుడు సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంధ్రరావు ఇప్పుడు సమంతతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు రాఘవేంద్రుడి సినిమాలో నటించడానికి ఆరాపటడుతుంటారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు సమంతకు పిలిచి మరీ అవకాశం ఇస్తానంటున్నాడు.
ఓ బేబీలో సమంత నటన చూసి షాక్ అయ్యానంటున్నాడు దర్శకేంద్రుడు. జులై 5న మీరే థియేటర్స్‌లో చూస్తారు కదా అంటున్నాడు ఈ దర్శక దిగ్గజం. అందుకే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరి సాక్షిగా సమంతకు తాను నెక్ట్స్ సినిమాలో గెస్ట్ రోల్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే దీనికి సమంత ఏమంటుంది అనేది మాత్రం సస్పెన్స్. ఏదేమైనా రాఘవేంద్రరావు మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ బయోపిక్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడు.
Comments
Post a Comment