మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ..

అర్బన్ హౌసింగ్ స్కీమ్ పై సీఎం నజర్ ....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అర్బన్ హౌసింగ్ ప్లాట్స్ నిర్మాణంపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష జరిపిన ఆయన గృహ నిర్మాణాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక గృహ నిర్మాణం విషయంలో కూడా గతంలో చదరపు అడుగుకు రూ.1,100 ఖర్చు అయ్యేదని, దానిని రూ.2,200-2,300కు పెంచి దోచేశారని సీఎం జగన్ ఆరోపించారు.

షేర్‌వాల్ పేరుతో పేదల మీద భారం వేస్తారా? అని ప్రశ్నించారు.

అర్బన్ హౌసింగ్‌లో ఫ్లాట్ల నిర్మాణాలపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

జగన్ ఇప్పటి వరకు ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్ కు వెళ్తానని పదేపదే హెచ్చరిం చారు.

వైయస్ జగన్ తొలిసారిగా అర్బన్ హౌసింగ్ స్కీమ్ విషయంలో రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం ఏదైతే సాంకేతికతతో నిర్మాణాలు కొనసాగుతున్నాయో అదే సాంకేతికతతో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?