ప్రత్యేక పాలనలోకి పురపాలక సంఘాలు

పురపాలక సంఘ పాలకవర్గాల పదవీ కాలం మంగళవారంతో ముగియటంతో జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్ళాయి.

జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం నగర పాలక సంస్థలతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ నగర పాలక సంస్థకు జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ను నియమించగా ఇప్పటి వరకు పురపాలక సంఘంగా కొనసాగి నేటి నుండి నగర పాలక సంస్థగా ప్రస్థానం కొనసాగించనున్న మచిలీపట్నం నగర పాలక సంస్థకు జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత నియమితులయ్యారు.

_పుర ప్రత్యేక అధికారులు వీరే...

నగరపాలక సంస్థలు :
విజయవాడ - కలెక్టర్ ఇంతియాజ్
మచిలీపట్నం - జెసీ డా. కె మాధవీలత

పురపాలక సంఘాలు :
గుడివాడ - జెసీ-2 బాబూరావు
పెడన - బందరు ఆర్డీఓ ఉదయ భాస్కర్
జగ్గయ్యపేట - విజయవాడ సబ్ కలెక్టర్ మిషాసింగ్
నూజివీడు - ఎస్సీ కార్పొరేషన్ ఇడీ మురళి

నగర పంచాయతీలు :
ఉయ్యూరు : గుడివాడ ఆర్డీఓ సత్యవాణి
నందిగామ - డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్
తిరువూరు - స్టెప్ సీఇఓ

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?