ఇటీవల వివాహం చేసుకున్న జంట దారుణ హత్యకు గురైంది.
తమిళనాడు తుత్తుకూడి జిల్లా కులాతూర్ గ్రామంలో ఇటీవల వివాహం చేసుకున్న జంట దారుణ హత్యకు గురైంది. అత్యంత పాశవికంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా దారుణంగా నరికి చంపేశారు. రెండు నెలల క్రితం, షెడ్యూల్డ్ కులానికి చెందిన సోలైరాజ్ తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెచియమ్మల్‌ను వివాహం చేసుకున్నాడు.
సోలైరాజ్ ఎస్సీలోని పారయ్యార్ వర్గానికి చెందినవారు, పెచియమ్మల్ ఎస్సీ కులానికి చెందిన పల్లర్ వర్గానికి చెందిన యువతి. వీరిని నిన్న ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీనిని పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. హత్య వెనుక మహిళ కుటుంబం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
Comments
Post a Comment