మృతుని కుటుంబానికి నారా లోకేశ్ ఆర్థిక సాయం

ఈతకు వెళ్లి చనిపోయిన రత్నాలచెరువుకు చెందిన మరియబాబు

లోకేశ్ సూచనతో మృతుని కుటుంబానికి టీడీపీ నేతల పరామర్శ

అండగా ఉంటామని హామీ

రూ.50000 ఆర్థిక సాయం అందజేత

మంగళగిరి

నారా లోకేశ్. నాయకత్వానికి అసలు సిసలైన చిరునామా. గెలుపు ఓటములతో సంబంధం లేదు. కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటారు. ప్రజలకు సాయం చేయడమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించే ఒక యువకుడు ఈతకు వెళ్లి చనిపోయాడని తెలుసుకున్నారు. చెట్టంత కొడుకు చనిపోయిన విషాదంలో ఉన్న మరియబాబు కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు రూ.50వేలు ఆర్థిక సాయం అందజేశారు.
మంగళగిరి పట్టణం రత్నాల చెరువు ప్రాంతానికి చెందిన రావినూతల మరియబాబు గుంటూరు చానల్ కాలువలో ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయి చనిపోయారు. దీంతో మరియబాబు కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న నారా లోకేశ్ ఆదేశాలతో మృతుని కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. పార్టీ తరఫున ఆర్ధికసాయంగా రూ.50 వేలు చెక్కును అందజేశారు. మరియబాబు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్ గంజి చిరంజీవి, నాయకులు మునగపాటి వెంకట మారుతీరావు, నందం అబద్దయ్య, వెలగపాటి విలియం, మొహమ్మద్ ఇబ్రహీం, మాజీ కౌన్సిలర్ చిలకా బసవమ్మ, కారంపూడి అంకమ్మ, పడవల మహేష్, తోకల బాలాజీ , బొడ్డు వెంకటేశ్వరరావు, జంజనం వెంకట సాంబశివరావు, షేక్ రియాజ్, షేక్ అమీర్, అబ్దుల్ మజీద్, పొట్లాబట్టుని లక్ష్మణరావులు ఉన్నారు.

మృతుని కుటుంబానికి రూ.50 వేలు చెక్ అందజేస్తున్న టీడీపీ నేతలు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?