తండ్రి లాంటోడే కాటేయాలనుకున్నాడు.. తప్పించుకుని బయటపడ్డ చిన్నారి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది.నిన్నటికి నిన్న సంచలనంగా మారిన మదర్సా ఘటన మరువక ముందే మరో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావుపేట మండలం, గాండ్లగూడెం గ్రామ పంచాయతీ పరిధికి చెందిన బాణోత్ ఇందు అనే మైనర్ బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు.బాలిక తల్లి పశ్చిమగోదావరి జిల్లా,తాడువాయి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది.తన ఇద్దరు పిల్లలను కూడా తాడువాయి గ్రామానికి తీసుకెళ్లి అతనితోనే ఉంటోంది.అయితే తండ్రిలా వ్యవహరించాల్సిన అతను.. ఆమె కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.అభంశుభం తెలియని చిన్నారిని వెకిలిచేష్టలతో భయపెట్టి,బెదిరించి లొంగదీసుకోవాలనుకున్నాడు.

ఇటీవల అతని అతని అకృత్యాలను తట్టుకోలేక అక్కడ్నుంచి తప్పించుకున్న బాలిక తన తల్లి స్వగ్రామమైన గాండ్లగూడెం చేరుకుని అమ్మమ్మ వద్ద తన గోడు వెళ్లబోసుకుంది.తనను ఏకాంతంగా బయటకు తీసుకెళ్లి అసభ్యకరరీతిలో శరీరభాగాల్ని తాకేవాడని,ఎదిరిస్తే విచక్షణా రహితంగా కొట్టేవాడని బాలిక భోరున విలపించింది.వాతలు పెట్టి,వేడినీళ్లు ఒంటిపై పోసి కాల్చడం,వైర్లతో కొట్టడం చేసేవాడని వాపోయింది. దీంతో బాలికను తల్లి వద్దకు పంపించకుండా ఆమె అమ్మమ్మ స్థానిక ఆశ్రమ పాఠశాలలో చేర్పించింది.అక్కడికి కూడా వచ్చిన ఆ కామాంధుడు గ్రామానికి సైతం వచ్చి బాలికను తనకు అప్పజెప్పాలని పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చాడు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాలికను అతనికి అప్పగించవద్దని స్కూల్ సిబ్బందిని కోరారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?