అసెంబ్లీ చర్చల్లో పలు విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం
అమరావతి :
అసెంబ్లీ చర్చల్లో పలు విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుండి వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతి సభ్యుడూ ఏ టైంకి వచ్చారు.. ఏ టైంకి వెళుతున్నారనే అంశంపై దఅష్టి పెట్టాలని చీఫ్ విప్‌కి జగన్ సూచించారు. ఈ వివరాలతో ప్రతి రోజూ సాయంత్రం తనకి నివేదిక ఇవ్వాలని జగన్ ఆదేశించారు. టిడిపి నేతలు అసెంబ్లీలో చేస్తున్న విమర్శల సమయంలో ఎక్కువ మంది వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండటం లేదని జగన్ భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేల హాజరుపై జిల్లా మంత్రులకి జగన్ బాధ్యత అప్పగించారు.
Comments
Post a Comment