తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల :
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
అలాగే స్వామివారి సర్వ దర్శనానికి కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచిఉన్నారు.
కాగా.. టైం స్లాట్ దర్శనం, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతోంది.
అలాగే ప్రత్యేక దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Comments
Post a Comment