ప్రభుత్వం మాది మేమేందో చూపిస్తాం

అమరావతి...

‘ధనుంజయరెడ్డి’ చెప్పినా చేయరా?
వైసీపీ కడప యువనేత వీరంగం
హెల్త్‌ సూపర్‌వైజర్‌ డిప్యుటేషన్‌ విషయంపై
గురుకుల సొసైటీ కార్యాలయంలో వీరంగం
ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి...
సారీ... మా వాడు తప్పు చేశాడు
సొసైటీ కార్యదర్శి రాములును కలిసిన చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: ‘ఏమనుకుంటున్నావ్‌... ఈ గవర్నమెంట్‌ మాది... ముందులాగా అనుకుంటున్నారేమో? చూపిస్తాం... మేమేందో... ధనుంజయ్‌రెడ్డి (సీఎం పేషీ అధికారి) పర్సనల్‌గా మనిషిని పంపిస్తే పట్టించుకుంటున్నావా? అసలు చదువుకుంటున్నావా?’ అంటూ వైసీపీ యువజన సంఘం నేత ఒకరు రాష్ట్ర అధికారులపై జులుం ప్రదర్శించారు.

కడప జిల్లా రాయచోటికి చెందిన సదరు వైసీపీ యువనేత ఓ ప్రభుత్వ రాష్ట్ర కార్యాలయంలో వీరంగం సృష్టించిన ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

. గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యదర్శితో పాటు సిబ్బందినీ తిడుతూ నానా యాగీ చేశారని తెలిసింది. సీఎం పేషీ అధికారులు చెప్పినా మా పని చేయరా? అంటూ ఆయన విరుచుకుపడ్డారు. అధికారులను నానా దుర్భాషలాడారు.

ఇది మా ప్రభుత్వం అంటూ సిబ్బందిని బెదిరించడంతో పనిచేస్తున్న ఉద్యోగులు అవాక్కయ్యారు. సీఎం పేషీ అధికారుల పిలుపు మేరకు అప్పుడే సచివాలయానికి బయలుదేరిన సెక్రటరీ కల్నల్‌ రాములు.. సదరు నేత హడావుడి చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అసలు విషయం ఇదీ...
కడప జిల్లాకు చెందిన ఓ మహిళ అదే జిల్లాలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.

గత మూడేళ్లుగా ఆమె డిప్యుటేషన్‌పై కడప రిమ్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగో సంవత్స
గత మూడేళ్లుగా ఆమె డిప్యుటేషన్‌పై కడప రిమ్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నాలుగో సంవత్సరం కూడా డిప్యుటేషన్‌ కొనసాగించేందుకు ఫైలును గురుకుల సొసైటీ కార్యదర్శికి పంపించారు. కల్నల్‌ రాములు పని ఒత్తిడిలో ఉండి ఆ ఫైలును చూడలేదు. దీంతో సీఎం పేషీ అధికారి ధనుంజయరెడ్డి ఆమె ఫైలును సిఫారసు చేస్తూ నోట్‌ పంపారు.

అడ్మిషన్ల గ్రీవెన్స్‌తో తలమునకలై ఉన్నప్పటికీ కల్నల్‌ రాములు ఆ ఫైలును ప్రాసెస్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో సీఎం కార్యాలయం నుంచి మీటింగ్‌కు రావాలని ఫోన్‌ రావడంతో బయలుదేరారు.

అప్పుడే ఆ యువనేత కార్యాలయంలో హల్‌చల్‌ చేస్తూండడంతో కార్యాలయంలో సిబ్బంది విధులకు ఆటంకమేర్పడింది.

మొత్తం సన్నివేశాన్ని ఫోన్‌లో రికార్డు చేసిన సిబ్బందిపై యువనేత అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నుంచి ఫోను లాక్కొని రికార్డు చేసిన సన్నివేశాలను డిలిట్‌ చేశారు.

సారీ చెప్పిన చీఫ్‌ విప్‌
జరిగిన సంఘటనను సీఎం పేషీ అధికారులు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శుక్రవారం గురుకుల సొసైటీ కార్యాలయానికి వచ్చారు.

సెక్రటరీ కల్నల్‌ రాములుని కలిశారు. తమ అనుచరుడు చేసిన హల్‌చల్‌పై శ్రీకాంత్‌రెడ్డి ఆయనకు సారీ చెప్పినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కానీవ్వమని హామీ ఇచ్చినట్లు సమాచారo.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?