దేశంలో మధ్య తరగతి జీవుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది.

దేశంలో మధ్య తరగతి జీవుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. 1999లో వీరి సంఖ్య 11.7 శాతం ఉండగా.. ఇప్పుడు అది 40శాతానికి చేరింది. దీంతో ప్రభుత్వాలు ఈ వర్గాన్ని విస్మరించే పరిస్థితి లేదు. ఈ ఏడాదిలో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో మధ్య తరగతి ఓటు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకొని వీరికి తాయిలాలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తరగతి పొదుపు మరింత పెంచేలా నిర్ణయాలు వెలువడవచ్చు.
ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రామాణిక తగ్గింపు పెంపు..
పింఛన్‌ పొందే వారికి ప్రస్తుతం రూ.50వేల వరకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ లభిస్తోంది. కానీ, ఫ్యామిలీ పెన్షన్‌ పొందేవారికి మూడోవంతు రూ.15వేల వరకూ ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం సెక్షన్‌ 57(ఐఐఏ)ను సవరించి రెగ్యులర్‌ పింఛన్‌దార్లతో సమానంగా ప్రామాణిక పెంపును ఇవ్వవచ్చు.
సైనిక దళాల్లో వికలాంగులకు ఊరట..
ఇటీవల సీబీడీటీ మాజీ సైనికులకు లభించే వైకల్య పింఛన్‌పై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ పరిస్థితుల్లో పదవీవిరమణ చేసిన వారికి లభిస్తున్న వైకల్య పింఛనుపైనే పన్ను విధించనున్నారు. దీనిని మాజీ సైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బడ్జెట్‌ సమయంలో కానీ, బడ్జెట్‌ ముందు కానీ దీనిపై సీబీడీటీ వివరణ ఇవ్వవచ్చు. 
పొదుపులపై..
సెక్షన్‌ 80సీ కింద లభించే జీవిత బీమా ప్రీమియం, పీఎఫ్‌ చెల్లింపు, పీపీఎఫ్‌, పిల్లల ట్యూషన్‌ ఫీజు, గృహరుణం ఈఎంఐ వంటి వాటిపై ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1,50,000 వేల వరకు మినహాయింపులు ఇస్తోంది. పిల్లల ట్యూషన్‌ ఫీజులు, గృహరుణాలపై ఈఎంఐతోనే ఈ మొత్తం సరిపోతోంది. ఈ మొత్తాన్ని  మరికొంత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే జరిగితే వినియోగదారుల పొదుపులు పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులకు కూడా రుణాలు ఇచ్చేందుకు తగినంత నగదు దొరుకుతుంది. 
అటల్‌ పెన్షన్‌ యోజనాలో మార్పులు..
ప్రస్తుతం ఈ స్కీంలో చేరేవారు 40ఏళ్ల లోపు ఉండాలనే నిబంధన ఉంది. దీనిని ప్రభుత్వం 50ఏళ్లకు పెంచాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు పింఛను మొత్తాన్ని కూడా రూ.5000 వేల నుంచి రూ.10,000కు పెంచాల్సిన అవసరం ఉంది. 
ఉద్యోగులు షేర్లు అమ్మినప్పుడే పన్ను
ప్రస్తుతం ఉద్యోగులుకు చాలా కంపెనీలు వాటాలను కేటాయిస్తున్నాయి. వీటిని కేటాయించే సమయంలో ఆ విలువకు తగినట్లు జీతం తగ్గిస్తారు. ప్రభుత్వం ఆ సమయంలో వాటాలను కూడా జీతం కిందే పరిగణించి పన్ను విధిస్తోంది. ఆ తర్వాత వాటాలను విక్రయించినప్పుడు క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నును విధిస్తోంది. దీంతో కేవలం విక్రయించినప్పుడు మాత్రమే క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను విధించాలని కోరుతున్నారు. ఇది స్టార్టప్‌లకు బలాన్నిస్తుంది. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?