ధోని నిజంగా గ్రేట్.. బ్యాటుపై లోగోలు అందుకే మార్చుతున్నాడు..

ఏ బ్యాట్స్‌మన్ అయినా బ్యాట్ చేతిన పట్టాడంటే.. దానిపై ఓ లోగో దర్శనమిస్తుంది. ఆ లోగోను బ్యాట్‌పై ఉంచుకున్నందుకు సదరు కంపెనీ ప్రచారం పేరిట.. బ్యాట్స్‌మన్‌కు ఎంతో కొంత ముట్టజెప్పుతుంది. సచిన్.. ఎమ్‌ఆర్‌ఎఫ్, రోహిత్ శర్మ.. సియట్, విరాట్ కోహ్లీ.. ఎమ్‌ఆర్‌ఎఫ్, ఒకప్పటి మహేంద్ర సింగ్ ధోని.. రీబాక్, స్పార్టన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో కంపెనీతో ఒప్పందం చేసుకొని, తమ బ్యాట్‌ ద్వారా కంపెనీలకు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రపంచకప్‌లో మాత్రం ఓ వెరైటీ జరుగుతోంది. ధోని పదే పదే బ్యాటుపై లోగోలు మార్చుతున్నాడు. ఒకసారి ఎస్‌ఎస్ లోగో, మరోసారి ఎస్‌జీ, ఇంకోసారి బీఏఎస్ లోగో వాడుతున్నాడు. సాధారణంగా బ్యాట్స్‌మన్ ఏదో ఒక బ్రాండ్‌కు మాత్రమే ప్రచారం చేస్తారు. రెండు, మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం సరైంది కూడా కాదు. కానీ ధోని విషయానికి వచ్చేసరికి.. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఎస్‌జీ లోగో, అంతకుముందు ఎస్‌ఎస్, బీఏఎస్ లోగోలు వాడాడు. మరి ధోని తన బ్యాటుపై లోగోలు ఎందుకు మార్చుతున్నాడో తెలుసా?

ఇదే ప్రశ్నకు ధోని మేనేజర్ అరుణ్ పాండే సమాధానమిస్తూ.. ‘అవును! ధోని ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్రాండ్‌కు చెందిన బ్యాట్ వాడుతున్నది నిజమే. అయితే, ఆ కంపెనీల వద్ద ధోని డబ్బులు తీసుకోవడం లేదు. తన కెరీర్‌లో సందర్భానుసారంగా ఆయా కంపెనీలు ధోనికి సాయం చేశాయి. అందుకే ఆ కంపెనీలకు కృతజ్ఞత చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు’ అని వెల్లడించాడు. ‘ధోనిది గొప్ప మనసు. ఆయనకు డబ్బులు అవసరం లేదు. ఆయనకు సరిపడా డబ్బు ఉంది. ఆయా కంపెనీలకు గౌరవం ఇచ్చేందుకు ఇలా చేస్తున్నాడు. ధోని కెరీర్ తొలినాళ్లలో బీఏఎస్, ఎస్‌జీ చాలా సాయం చేశాయి’ అని వివరించాడు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?