రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్నం :
ఎండ తీవ్రత, సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో కోస్తాలో సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణ అనిశ్చితి నెలకొంది.
శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు మేఘాలు ఆవరించాయి. అనేకచోట్ల వర్షాలు కురిశాయి.
సోమవారం సాయంత్రం వరకు పూసపాటిరేగలో ఎనిమిది, నెల్లిమర్ల, అచ్చెంపేటల్లో ఏడు, పద్మనాభంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి.
ఈనెల 17 నుంచి కోస్తాలో, 18 నుంచి రాయలసీమలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 18, 19 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Comments
Post a Comment