ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్

అమరావతి

అసెంబ్లీ కమిటీ హాల్లో గౌరవ శాసనసభ, శాసన మండలి సభ్యులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు నేటితో పూర్తయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ,స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయన్నారు.

ఈ కార్యక్రమం నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

అసెంబ్లీ జరిగే సమయంలో సభలో సభ్యులు ఎలా ఉండాలి, అసెంబ్లీ వ్యవహారాలపై ఉండాల్సిన అవగాహన,సభ్యులు  వ్యవహరించే తీరు ఇలా  పలు అంశాలపైన అవగాహన కల్పించారన్నారు.

రాజ్యాంగ విలువలు, నియమ నిబంధనలు గురించి కూలంకషంగా తెలుసుకునే అవకాశం ప్రతి  సభ్యుడికి వచ్చిందన్నారు.

దేవాలయం లాంటి అసెంబ్లీలో అవాస్తవమైన మాటలు పలకవద్దని స్పీకర్ దిశానిర్ధేశం చేశారని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రతి ఒక్కరూ అసెంబ్లీ సమావేశాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజాసమస్యలు, నియోజకవర్గ సమస్యలు సభలో లేవనెత్తి ప్రజల కోసం పాటుపడాలన్నారు.

ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, షార్ట్ డిస్కషన్ సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయం గురించి క్లుప్తంగా తెలుసుకున్నామన్నారు.

మరీ ముఖ్యంగా సీనియర్ అధికారులు, సభ్యులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐవైఆర్ కృష్ణారావు అందించిన సలహాలు, సూచనలు ప్రతి ఒక్క సభ్యుడికి ఎంతో ఉపయోగపడ్డాయి అన్నారు.

రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క శాసనసభ్యుల బాధ్యతలు గుర్తుచేశారు.

ఖర్చు అధికంగా ఉండవద్దనే ఉద్దేశంతోనే అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ సమావేశాలను నిర్వహించామని, కేవలం లక్ష రూపాయలతో కార్యక్రమం సజావుగా సాగిందన్నారు.

బ్యూరోక్రసి, లెజిస్లేచర్ రెండు కళ్లలాంటివని, వాటి నుంచి మంచినే తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించామని వెల్లడించారు.

రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశాలతో ప్రతి ఒక్కరికి శాసనసభ మీద మరింత గౌరవం పెరిగిందని తెలిపారు.

తప్పకుండా సభకు అందరు సభ్యులు హాజరై ప్రజాసమస్యలకు పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి  వెల్లడించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?