శాసనమండలిలో ఎమ్మెల్సీ నారా లోకేష్...
ఇది తుగ్లక్ పాలనలో ప్రవేశపెట్టిన కొయ్యగుర్రం బడ్జెట్
అసత్యంతో సాధించిన విజయం కన్నా సత్యంతో సాధించిన పరాజయం మేలు అని గాంధి గారు చెప్పారు
14 నెలల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర లో జగన్ గారు 600 కి పైగా హామీలు ఇచ్చారు
అధికారంలోకి రాగానే 600 హామీలను నవ రత్నాలకు కుదించారు
ఇప్పుడు ఆ నవ రత్నాల పై కూడా ప్రజలకు నవ సందేహాలు కలుగుతున్నాయి
బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు కూతల ప్రభుత్వం...బడ్జెట్ చూసాకా కోతల ప్రభుత్వం అని తేలింది
సగం మందికే విద్య,సగం మందికే ఆరోగ్యం,సగం మందికే సంక్షేమం
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు,గ్రామ వాలంటర్లు పేరుతో వైఎస్ఆర్ కార్యకర్తల దోపిడీ పథకం
మద్యపాన నిషేధం అంటూ జగనన్న మద్యం దుకాణాలు
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై రోజుకో విధంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతున్నారు
రాష్ట్ర అప్పుల పై మూడు సార్లు మాట మార్చి అసలు నిజాన్ని అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టారు
పార్థసారథి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అప్పు లక్ష కోట్లు అని చెప్పారు.బయట మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం అన్న జగన్ గారు తిరుపతిలో మోడీ గారి కాళ్లు పట్టుకున్నారు
ఎంత మంచి నేల అయిన విత్తనం వేస్తేనే పంట అని ఆర్థిక మంత్రి అన్నారు.
మనవి మంచి నేలలే కానీ ప్రభుత్వమే విత్తనాలు ఇవ్వలేక చేతులు ఎత్తేసింది
మన రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలు కర్ణాటక,తెలంగాణలో ఎలా ప్రత్యకమయ్యాయో ఈ ప్రభుత్వం చెప్పాలి
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అని పాదయాత్ర 11 వ రోజు కర్నూలు లో ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీ ఎక్కడికి పోయింది
గత ఐదు ఏళ్లలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారికి 7 లక్షల చప్పున పరిహారం ఇస్తాం అంటున్నారు
వైఎస్ హయాంలో చనిపోయిన 15 వేల మంది రైతులకు పరిహారం ఇవ్వరా?ఆ కుటుంబాలకు ఓదార్పు అవసరం లేదా?
80 లక్షల మంది రైతులకు రైతు భరోసా అని హామీ ఇచ్చారు.ఇప్పుడు కేవలం 64 లక్షల మంది రైతులకు మాత్రమే అంటున్నారు
టిడిపి హయాంలో 50 వేల కంటే తక్కువ ఉన్న రుణాలను సింగిల్ స్ట్రోక్ లో మాఫీ చేసాం
ఇప్పుడు 50 వేలు 5 ఏళ్లలో దశల వారిగా ఇస్తాం అంటున్నారు
అమ్మ వడి పిల్లలకు బలం అన్నారు.80 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 40 లక్షల మందికే అమ్మ ఒడి పథకం అంటున్నారు
మిగిలిన 40 లక్షల మంది బలహీనంగా ఉండాల్సిందేనా
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ నిధులకు కోత పెట్టారు
గృహ నిర్మాణానికి నిధులు తగ్గించారు
ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం లాక్షా 70 వేలతో ఇల్లు కట్టాలి
అంటే రాజీవ్ గృహ కల్ప కూలిపోయే ఇళ్ల కంటే దారుణమైన ఇల్లు ఈ ప్రభుత్వం కట్టాలి అనుకుంటుంది
ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారు మడమ తిప్పుతున్నారు
ప్రైవేట్ సంస్థల్లో 80 శాతం స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని ఇప్పటివరకు ఉన్న నిబంధన...మరి ఇప్పుడు 75శాతం అని సర్కార్ అంటుంది...5 శాతం తగ్గించి యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గించాలి అనుకుంటుంది ఈ ప్రభుత్వం
1 కోటి 70 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని జగన్ గారు ఆయన పత్రిక లో తెలిపారు
ఉన్న నిరుద్యోగ భృతి కూడా ఎత్తేసారు
భూముల ధరలు పెంచేయడంతో
కీయా అనుబంధ సంస్థలు అన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
ఒకపక్క మద్యపాన నిషేధం అంటారు...మరో వైపు మద్యం ఆదాయం పెంచుకుంటున్నారు.
*అమరావతి బ్రమరావతి అన్నారు...ఇప్ప్పుడు మీరు కూర్చుంది ఎక్కడ?*
*మంత్రులు కుయ్ కుయ్ అని తిరుగుతున్న రోడ్లు ఎవరు వేశారు?*
*జగన్ సర్కారు ఇప్పుడు అమరావతి ని నిజంగానే బ్రమరావతి చేసింది.*
అమరావతి లో పనులు ఆగిపోయి ఖాళీ అయ్యింది
దేశంలో ఎక్కడా లేని విధంగా సున్నా వడ్డీకే రుణాలు అన్నారు
అయ్యా ఇది కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వం నుండి ఉన్నదే అంటూ ఆధారాలు చూపించాం
సున్నా వడ్డీ రుణాల పై సీఎం రాజీనామా చేస్తారా?లేక క్షమాపణ చెప్తారా అనేది తెలియాలి.
పట్టిసీమ ని జగన్ దండగ అన్నారు ఆనాడు...ఇప్పుడు పట్టిసీమ పండగ అని చెప్పుకునే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది.
పట్టిసీమ ద్వారా 260 టీఎంసీ ల నీరు ఇచ్చాము.కృష్ణా డెల్టా ని కాపాడాం
పోలవరం కి నిధులు కేటాయించని ముఖ్యమంత్రి ఎగువ రాష్ట్రం నుండి నీళ్లు తెస్తా అంటే హాస్యాస్పదంగా ఉంది
మన రాష్ట్ర హక్కులు పనంగా పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టును కట్టడం కరెక్ట్ కాదు
ఆరోగ్య శ్రీ ని అనారోగ్య శ్రీ గా మార్చబోతున్నారు
1000 పైన ఖర్చు అయిన ప్రతి జబ్బు ఆరోగ్య శ్రీ కిందకి తీసుకోస్తాం అని 1740 కోట్లు కేటాయించారు.దీనికి కనీసం 5 వేల కోట్లు అవుతుంది
Comments
Post a Comment