ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, గురుదాస్‌పూర్‌ ఎంపీ సన్నీ దేవోల్‌ చేసిన ఓ పని వివాదానికి కారణమైంది.

గురుదాస్‌పూర్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, గురుదాస్‌పూర్‌ ఎంపీ సన్నీ దేవోల్‌ చేసిన ఓ పని వివాదానికి కారణమైంది. ఎంపీ అయినా సమావేశాలకు మాత్రం తాను నియమించే మరోవ్యక్తి హాజరవుతారని మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ‘‘మొహాలి జిల్లా పల్హేరీ గ్రామానికి చెందిన గురుప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని నా ప్రతినిధిగా నియమిస్తున్నాను. ఇక నుంచి నా నియోజకర్గానికి సంబంధించి జరిగే అన్ని సమావేశాలు, కార్యక్రమాలకు నా తరఫున ఆయనే హాజరవుతారు’’ అని లేఖలో సన్నీ దేవోల్‌ పేర్కొన్నారు. 
సన్నీ దేవోల్‌ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తనని గెలిపించిన ప్రజల్ని సన్నీ దేవోల్‌ వంచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటర్లు ఎన్నుకున్న ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఎలా నియమిస్తారని నిలదీశారు. దీనిపై స్పందించిన ఆయన ప్రతినిధి గురుప్రీత్‌ సింగ్‌ కేవలం స్థానిక సమస్యల పరిష్కారం కోసమే సన్నీ తనని నియమించారన్నారు. ప్రతి నెల సన్నీనే స్వయంగా నియోజకర్గంలో పర్యటిస్తారన్నారు. 24 గంటలు ప్రజాసేవలో ఉండడంలో భాగంగా ఆయన ఇలా చేశారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున సన్నీ దేవోల్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్‌ జాఖర్‌పై 82,459 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?