షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
పెద్దపల్లి జిల్లా:-
జిల్లా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం వాటిల్లింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని మెయిన్ రోడ్ లో గల, అర్షద్ ఫుట్వేర్ లో, షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి, ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చెప్పుల దుకాణం కాలి బూడిద అయింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్ర స్థాయిలో శ్రమ పడాల్సి వచ్చింది...
Comments
Post a Comment