మెగా హీరోల కంటే చిరంజీవిని బాగానే వాడేసుకుంటున్న బయట హీరోలు..

గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. పేరు బాగానే మెగా ఫ్యాన్స్ మాత్రం నాని ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంటి ? ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటూ నానిపై దుమ్మెత్తి పోస్తున్నారు. నాని కొత్త సినిమాకు  ‘గ్యాంగ్ లీడర్‌’ టైటిల్‌పై మెగా ఫ్యాన్స్ పెద్ద రచ్చే చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వివాదం సద్దు మణిగింది.ఇంకోవైపు బెల్లంకొండ శ్రీనివాస్..రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న సినిమాకు ‘రాక్షసుడు’ టైటిల్ ఫిక్స్ చేసారు. ఒకవైపు గ్యాంగ్ లీడర్‌, రాక్షసుడు’ టైటిల్స్‌పై మెగా హీరోలు రచ్చ నడుస్తుండగా..  తమిళ హీరో కార్తి..చిరంజీవికి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఆల్ టైమ్ హిట్  ‘ఖైదీ’ సినిమా పేరును తన నెక్ట్స్ సినిమాకు ఫిక్స్ చేసుకున్నాడు.

కార్తి సరసన రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మార్చ్‌లో మొదలుకానుంది. ఈ సినిమాను తమిళంలో ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తమిళంలో ఎలాగే ‘ఖైదీ’ టైటిల్‌ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్..తెలుగులో కూడా అదే టైటిల్‌తో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవిని వాళ్ల ఫ్యామిలీ హీరోలకంటే బయటి హీరోలే ఎక్కువగా యూజ్ చేసుకుంటారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?