ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మనసు మార్చుకోడు.. వాళ్లు ఆయన్ని వదులుకోరు..

పవన్ కళ్యాణ్ సినిమాలు చేయ‌ని అని అలాగే ఉండిపోయుంటే స‌రిపోయేది. కానీ ఆశ‌లు రేపుతూ మ‌ళ్లీ కొత్త లుక్ చేసి ఇప్పుడు అభిమానుల‌కు టెన్ష‌న్ పెంచేసాడు ప‌వ‌ర్ స్టార్. ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా ఈయ‌న మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నాడేమో అనే అనుమానాలే వ‌స్తున్నాయి. మొన్న తానా సభలకు వచ్చిన పవన్ లుక్ చూసి అంతా ఫిదా అయిపోయారు. అయితే అది ఏదో క్యాజువ‌ల్ లుక్కే కానీ సినిమా కోసం కాద‌ని ప‌వ‌న్ చెప్పాడు. కానీ అభిమానులు మాత్రం అలా అనుకోవ‌డం లేదు. క్యాజువ‌ల్ కాదు.. ఒక్క సినిమా చేయండి స‌ర్ అంటున్నారు.

సినిమాలు చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై రోజురోజుకీ ఒత్తిడి పెరిగిపోతుంద‌ని తెలుస్తుంది. అస‌లు ఈయ‌న అద్భుత‌మైన కెరీర్ అజ్ఞాత‌వాసి లాంటి డిజాస్ట‌ర్ సినిమాతో ముగించడం ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న దృష్టి మొత్తం జ‌న‌సేన‌పైనే ఉంది. అందుకే ఓట‌మిపై రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టాడు. అది పూర్తైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా కొత్త లుక్‌లోకి వచ్చాడు పవర్ స్టార్. అప్పటి వరకు జనసేన అధినేతగా కనిపించిన ఆయన సడన్‌గా ఉన్నట్లుండి పవర్ స్టార్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు ఈయన లుక్ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు తెరతీస్తుంది.

ప‌వ‌న్ సినిమాలు మానేసినా ప‌ర్లేదు కానీ క‌నీసం ఒక్క సినిమా చేస్తే బాగుండేది అంటున్నారు. ఈయ‌న ఓకే అంటే ఎంతోమంది నిర్మాత‌లు క్యూ క‌డ‌తార‌ని తెలుసు. కానీ ప‌వ‌న్ మ‌న‌సు మాత్రం ఇంకా క‌ర‌గ‌డం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా త‌న రీ ఎంట్రీపై మ‌ళ్లీ మ‌ళ్లీ వార్త‌లు రావ‌డంతో ప‌వ‌న్ ఒకింత అస‌హ‌నానికి లోనైన‌ట్లు తెలుస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి.. త‌ను సినిమాలు చేయ‌ను.. రాజ‌కీయాల్లోనే ఉంటాన‌ని అంటూ రివ్యూ మీటింగులో కాస్త సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తుంది. 

అంతేకాకుండా త‌న‌ను న‌మ్ముకుని వ‌చ్చిన పార్టీ శ్రేణుల‌కు కూడా అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్ చెప్పిన‌ట్లు తెలుస్తుంది. క‌చ్చితంగా త‌ను పార్టీ సంస్థాగ‌త ప‌నుల‌తోనే బిజీగా ఉంటాన‌ని.. సినిమాల వైపు అస్స‌లు వెళ్ల‌న‌ని చెప్పాడు ప‌వ‌న్. జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ త‌న పార్టీ వ‌ర్గాల‌కు కూడా చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్పుడు మ‌న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం కూడా ఇదే అని వాళ్ళ‌కు చెబుతున్నాడు ప‌వ‌న్. 

ఇక ఈ సారి ఎన్నిక‌ల్లో మ‌రీ ఇంత దారుణంగా ఒడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం గతంలో తాము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే అని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. అదే చాలా వ‌ర‌కు పార్టీ కొంపముంచిందనేది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అందుకే ఇక‌ముందు పార్టీకి సొంతంగా ఓ నియ‌మావ‌ళి ఏర్ప‌రుచుకుని అలాగే ముందుకు సాగాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాతైనా ప‌వ‌న్ మ‌న‌సు మార్చుకుంటాడ‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?