పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి.
పంజాబ్ : పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. ప్రమాదం అని తెలిసినా.. రిస్కీ స్టంట్‌లు చేస్తారు. పంజాబ్ లుథియానాలో కొందరు యువకులు చేసిన డేంజరస్ స్టంట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు యువకులు రైల్వే బ్రిడ్జి పక్కనే ఉన్న కాలువలో దూకుతూ సర్కస్ ఫీడ్స్ చేశారు. రైలు వచ్చే వరకూ ఆగి, రైలు వస్తుండగా... ఒకేసారి కాలువలోకి యువకులంతా జంప్ చేశారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ రెచ్చిపోయారు. ఆ స్టంట్‌లను వీడియో తీసి వాట్సాప్ గ్రూప్‌లలో షేరు చేశారు. ఆ వీడియో పోలీసులకు చేరడంతో.. ఆ యువకులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
Comments
Post a Comment