ఇనుప ఖనిజ గనుల లీజు రద్దు కోరుతూ పిటిషన్
ఢిల్లీ:
ఇనుప ఖనిజ గనుల లీజు రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
దేశంలో 358 ఇనుప ఖనిజ గనుల లీజును రద్దు చేయాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ పేర్కొన్నారు.
గనుల కేటాయింపులో రూ.6 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును కోరారు.
Comments
Post a Comment