ఓ విమానాన్ని లారీపై
విజయవాడ:
పాడైపోయిన ఓ విమానాన్ని లారీపై తీసుకొచ్చి విజయవాడ నగర శివారు నిడమానూరులో జాతీయ రహదారి పక్కన ఉంచారు. గత మూడు రోజులుగా ఇక్కడే ఉంటోంది. చాలా మంది ప్రజలు దానిని వింతగా చూస్తూ.. సెల్ఫీలు తీసుకుంటున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి దానిని ఇక్కడికి తీసుకొచ్చారంట. ఇప్పటికే దిల్లీలాంటి నగరాల్లో విమాన రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. వాటిని చూసి.. అదే తరహాలో విజయవాడలో ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన ఓ ఔత్సాహికుడు స్క్రాప్‌లో విమానాన్ని కొనుగోలు చేశారు. దీన్ని రెస్టారెంట్‌లా తయారు చేసేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించారు
Comments
Post a Comment