చిల్లర వ్యాపారులకు పెన్షన్ స్కీం ..
ఢిల్లీ :
సుమారు మూడు కోట్ల చిల్లర వ్యాపారులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.
ఇవాళ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ,,,,
వార్షిక టర్న్ఓవర్ 1.5 కోట్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్న రిటేల్ ట్రేడర్లకు పెన్షన్ బెనిఫిట్ కల్పించనున్నట్లు ఆమె చెప్పారు.
ప్రధానమంత్రి కరమ్ యోగి మాన్ ధాన్ స్కీమ్ కింద ఇది వర్తిస్తుందన్నారు. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్న మధ్యశ్రేణి సంస్థలకు 2 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.
దాని కోసం సుమారు 350 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. కిరాయి ఇంటి చట్టాలను మార్చనున్నట్లు ఆమె చెప్పారు.
సామాజిక కార్యక్రమాల కోసం ప్రత్యేక స్కీమ్‌ను ఏర్పాటు చేశారు.
నిధుల సమీకరణ కోసం సోషల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఏర్పాటు చేయనున్నారు.
Comments
Post a Comment