జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్‌కు షాక్ ఇచ్చిన జగన్ పాదయాత్ర..

తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా రాజ‌కీయాలు బాగానే ఉన్నాయి. అక్క‌డ కూడా పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా టీడీపీ వాళ్లే ఉన్నార‌ని ఈ మ‌ధ్యే పోసాని చెప్పాడు. తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స‌పోర్ట్ చేసాన‌ని.. త‌న‌కు అవ‌కాశాలు రాకుండా చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. ఆ త‌ర్వాత 30 ఇయ‌ర్స్ పృథ్వీ కూడా ఇదే చెప్పాడు. ఇక ఇప్పుడు మ‌రో క‌మెడియ‌న్ కూడా ఇదే చెప్తున్నాడు. ఈ సారి ఈ సెగ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వైపు వెళ్లింది.

ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ చేసిన పాదయాత్రలో సినిమా వాళ్లు కూడా భారీగానే వ‌చ్చారు. అందులో జబర్దస్త్ కమెడియన్లు శాంతి స్వరూప్, వినోద్‌లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అక్క‌డ లేడీ వేషాల‌తో పాపుల‌ర్ అయ్యారు వాళ్లు. అప్ప‌ట్లో వాళ్లు జగన్ పాదయాత్రకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో మూడు నెల‌ల పాటు జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో అస్స‌లు క‌నిపించ‌లేదు. దాంతో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వెళ్ల‌డ‌మే తాము చేసిన త‌ప్పు అని త‌ర్వాత అర్థ‌మైంద‌ని చెప్పాడు ఈయ‌న‌.

అయితే అందులో జ‌బ‌ర్ద‌స్త్ డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ త‌ప్పు కానీ.. టీం లీడ‌ర్స్ త‌ప్పు కానీ ఏం లేద‌ని చెప్పాడు శాంతి స్వ‌రూప్. అప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర కోసం తామే జబర్దస్త్ మానేసి వెళ్లామ‌ని.. అయితే త‌మ‌కు లైఫ్ ఇచ్చిన జ‌బ‌ర్ద‌స్త్ షోను వ‌దిలి వెళ్లాల్సి ఉండ‌కూడ‌ద‌ని త‌ర్వాత తెలుసుకున్నామ‌ని చెప్పాడు స్వ‌రూప్. ఏదో తెలియని మైకంలో తాను, వినోద్ వాళ్లు పిలిచారు కదా అని వెళ్లిపోయామని శాంతి స్వరూప్ చెప్పాడు.

దాంతో టీమ్ లీడ‌ర్స్ తమ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌లేక‌పోయార‌ని.. ఇబ్బందులు ప‌డ్డార‌ని గుర్తు చేసుకున్నారు. దాంతో జ‌బ‌ర్ద‌స్త్ డైరెక్ష‌న్ టీం ఇంకెవ‌రూ ఇలా చేయ‌కూడద‌ని త‌మ‌పై మూడు నెల‌ల పాటు నిషేధం విధించార‌ని గుర్తు చేసుకున్నాడు. త‌మ‌ను నమ్ముకుని స్కిట్లు రాసుకున్నపుడు ఇలా వదిలేసి వెళ్లడం త‌ప్ప‌ని తెలిసేలా చేసార‌న్నాడు శాంతి.

త‌మ‌ను నిషేధించిన మూన్నెళ్లు కూడా అందరితో టచ్‌లోనే ఉన్నామ‌ని చెప్పాడు ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్. కానీ బయట మాత్రం జగన్ పాద‌యాత్ర‌కు వెళ్ల‌డం వ‌ల్లే త‌మ‌ను తీసేసార‌ని ప్ర‌చారం జ‌రిగింద‌ని.. అది నిజం కాద‌ని చెప్పాడు ఈయ‌న‌. మొత్తానికి తాము జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌టికి వెళ్ల‌డానికి.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఎలాంటి సంబంధం లేద‌ని క్లారిటీ ఇచ్చాడు శాంతి స్వ‌రూప్.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?