కూతుర్ని చంపి... యాసిడ్ తాగిన తల్లి... ఎందుకంటే...
తెలంగాణ... కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటకు చెందిన షేక్ తాజుద్దీన్... పని కోసం గల్ఫ్ వెళ్లి ఈమధ్యే వచ్చాడు. అతని భార్య వసీమా,కూతురు ఒమేజా (5). కొన్నాళ్లుగా వసీమా మానసిక స్థితి బాలేదు. వింత వింతగా ప్రవర్తిస్తోంది. శుక్రవారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో తాజుద్దీన్... తన భార్య, కూతుర్ని అదే కాలనీలో నివసించే బంధువుల ఇంట్లో వదిలి హైదరాబాద్ వెళ్ళాడు. సాయంత్రం వరకూ వసీమా తన కూతురుతో బంధువుల ఇంట్లోనే ఉంది. సాయంత్రం ఇంటికి వెళ్లి వస్తానని... కూతుర్ని తీసుకుని బయలుదేరింది. ఇంటికి వెళ్లాక కూతురు ఒమేజా మెడకు చున్నీ చుట్టి, గట్టిగా లాగింది. అంతే... ఊపిరాడక ఆ చిన్నారి... తల్లి చేతిలోనే ప్రాణాలు విడిచింది. కూతురు చనిపోయాక... స్క్రూడ్రైవర్‌తో పాప కడుపులో పొడిచింది. ఆ తర్వాత వసీమా... యాసిడ్ తాగింది.
ఇంటికి వెళ్లిన వసీమా ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు ఆందోళన చెంది... ఆమె ఇంటికి వచ్చి చూశారు. వెంటనే తల్లీ కూతుళ్లను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని చెప్పిన డాక్టర్లు... వసీమా పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ పంపారు.
వసీమా ఇలా ఎందుకు చేసిందో... ఆమె స్పృహలోకి వస్తే తప్ప తెలియదు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా చేసిందా అన్న డౌట్ ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. బలమైన కారణాలు ఉంటేనే ఇలా చేస్తారని అంటున్నారు.
Comments
Post a Comment