జగన్ పాలనపై జయప్రకాశ్ నారాయణ్ .. ఇది జమిందారీ వ్యవస్థ కాదన్న జేపీ
లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకపక్క నెలరోజులే కదా ఇంకా ఏమీ అప్పుడే చెప్పలేం అంటూనే జగన్ పాలన జమిందారీ పాలనలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిర్మాణంతో కాకుండా విధ్వంసంతో పాలన స్టార్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు మాటిచ్చాను కాబట్టి మాట కోసం ఏదైనా చేస్తా అంటే అది పాలన కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు ఏపీ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చివేయాలని తీసుకున్న నిర్ణయం కూడా తప్పే అని ఆయన పేర్కొన్నారు.
Comments
Post a Comment