ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిలయెన్స్ జియో గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో 10,000 టవర్లతో సేవలు అందిస్తోంది రిలయెన్స్ జియో. భారతదేశ టెలికాం రంగంలో అనేక సంచలనాలు సృష్టించిన రిలయెన్స్ జియో... ఏపీలో యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 10,000 టవర్లతో కీలక మైలురాయిని చేరుకుంది. నెట్‌వర్క్ విషయంలో మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది జియో. ఆంధ్రప్రదేశ్‌లో 1.30 కోట్ల మంది రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రతీ నెలా ప్రతీ జిల్లాలో యూజర్ల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి సేవలు అందించే దిశగా నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది రిలయెన్స్ జియో. 2019 ఏప్రిల్ ట్రాయ్ గణాంకాల ప్రకారం రిలయెన్స్ జియోకు భారతదేశంలో 31.48 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

34 నెలల క్రితం జియో టెలికామ్ సేవలు ప్రారంభమయ్యాయి. టెలికామ్ రంగంలో రిలయెన్స్ జియో అనేక సంచలనాలు సృష్టించింది. ఇప్పటికీ సృష్టిస్తూనే ఉంది. అత్యధిక యూజర్లకు డేటా సేవలు అందిస్తూ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రీ వాయిస్ కాల్స్ కలను నిజం చేసింది రిలయెన్స్ జియో. తక్కువ ధరకే 4జీ డేటా అందిస్తూ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తోంది. సాటిలేని కనెక్టివిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా సేవలు, జియో ప్రీమియం యాప్స్ బెనిఫిట్స్, జియో టీవీ, జియో మ్యూజిక్, జియో సినిమా లాంటివాటితో యూజర్లందరికీ సేవలు అందిస్తోంది రిలయెన్స్ జియో.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?