బీజేపీ నేతకు కేటీఆర్ కౌంటర్... సారీ అంటూ...

గుజరాత్‌కు చెందిన సూరత్ బీజేపీ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. సాగర్ అనే నెటిజన్ కేటీఆర్‌ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌కు ట్యాగ్ చేసి ప్రశ్నలు సంధించారు పీవీఎస్ శర్మ. వాటర్‌ గ్రిడ్‌ సిస్టమ్‌ను అధ్యయనం చేసేందుకు మీరు గుజరాత్‌ సందర్శించిన విషయం వాస్తవం కాదా ? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. వాటర్‌ గ్రిడ్‌ను, సబర్మతి నదిలోకి నీళ్లు ఎత్తిపోసే నర్మదా కాలువను మీరు ప్రశంసించలేదు ? అని వివరించారు. దాని ఆధారంగానే మీరు కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చేపట్టలేదా ? నిజాలను అంగీకరించండి అని ఆయన పేర్కొన్నారు. 

దీనిపై స్పందించిన కేటీఆర్...తనదైన శైలిలో ఆయనకు కౌంటర్ ఇచ్చారు. డియర్‌ శర్మ గారూ.. మిమ్మల్ని డిసపాయింట్‌ చేస్తున్నందుకు సారీ అంటూ ట్వీట్ మొదలుపెట్టారు. 1998లో (గుజరాత్‌కు 12 ఏళ్ల ముందు) సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో చేపట్టిన సమగ్ర తాగునీటి ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకొని మిషన్‌ భగీరథను రూపొందించామని అన్నారు. గుజరాత్‌ మోడల్‌ను అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని ప్రధాని లేఖలో కోరితేనే.. ఆ రాష్ట్రాన్ని నేను సందర్శించానని బదులిచ్చారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?