విధుల పట్ల అలక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..కలెక్టర్ ముత్యాలరాజు
పశ్చిమగోదావరి జిల్లా
పెనుమంట్ర
ఉద్యోగులు తమకు అప్పగించబడిన విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హెచ్చరించారు.
ఆచంట నియోజవర్గ పరిధిలో సాదాసీదాగా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సుడిగాలి పర్యటన
పలు శాఖలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పెనుగొండ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలికల ఉన్నత రెసిడెన్షియల్ పాఠశాల పూర్తిస్థాయిలో తనిఖీచేసి ఇంకా సమకూర్చాల్సిన వసతులను గూర్చి నమోదు చేసుకొని సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం
పెనుమంట్ర మండలం నెగ్గిపూడి (ఆల్ఫా కాన్వెంట్ ఆవరణలో గల) మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేయగా జూన్ 12 న పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తరగతులు ప్రారంభించకపోవడం, సుమారుగా 11 హాస్టళ్ల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తారని, 219 మంది పిల్లలు ఉండాల్సిన స్కూల్లో ఒక్కరుకుడా లేకపోవడంతో సిబ్బంది సరైన బాధ్యతగా వ్యవహరించకపోవడంతో ABCWO ని సస్పెండ్ చేసి తదుపరి కార్యాచరనకై ఆదేశాలు జారీ చేశారు.
ఆచంటలో గల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ అవసరమైన కావలసిన ఉపకరణాలు వస్తువులు వివరాలు తెలిపితే నిధులు కేటాయిస్తామని ప్రజలకు పూర్తి స్థాయిలో ఆరోగ్య,సామాజిక భద్రత కల్పించాలని డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఇప్పటివరకు నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంభదించిన అన్ని పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన కోరారు
Comments
Post a Comment