హైదరాబాద్ ఔటర్ రింగ్ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం
హైదరాబాద్:
హైదరాబాద్ ఔటర్ రింగ్ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బెంజ్‌కారు వచ్చిన యూఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్ అహ్మద్ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు రాయదుర్గంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఫైజల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు
Comments
Post a Comment