ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
సంగారెడ్డి:
ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
నేడు జలదీక్షకు వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
గత కొద్ది రోజులుగా ఆయన సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్షకు పూనుకుంటానని వెల్లడించారు.
అయితే నేడు ఆయన జలదీక్షకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి కొండాపూర్ పీఎస్‌కు తరలించారు.
Comments
Post a Comment