గ్యాస్ లీకయ్యి అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం :
గ్యాస్ లీకయ్యి అగ్ని ప్రమాదం సంభవించి 10 పూరిళ్లు దగ్ధమైన ఘటన సోమవారం రాజాం మండలం పొగిరిలో చోటు చేసుకుంది. పొగిరిలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకవ్వడంతో అగ్ని రాజుకొని 4 సిలిండర్లు పేలి, 10 పురిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇళ్లలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వెంటనే రాజాం, పొందూరు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.30 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు.
Comments
Post a Comment