తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడ
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు కత్తులతో దాడిచేసిన సంఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామంలో శనివారం రాత్రి వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘర్షణ కాస్త తీవ్రరూపం దాల్చి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ సందర్భంగా మురళి, సూజన్, రాజు అనే టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. కాగా... టీడీపీ కార్యకర్తల ప్రతిదాడిలో పలువురు వైసీపీ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన ఇరువర్గాల వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో మోహరించారు.
Comments
Post a Comment