సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు.
గుంటూరు:
అవినీతి రాజ్యానికి రాజు జగన్ అని వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
హౌసింగ్ విషయంలో షేర్ వాల్ టెక్నాలజీ సరైంది కాదని వైసీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు.
పేదలు పురాతన ఇళ్లల్లోనే ఉండాలని జగన్ కోరికా?, నూతన ఇళ్లల్లో పేదవారు ఉండకూడదా? అని నిలదీశారు.
పేదవాళ్లను చులకనగా చూడొద్దన్నారు. రాజీవ్ గృహాకల్పపై కూడా విచారణ చేస్తే బాగుంటుందని హితవుపలికారు.
2004 నుంచి 2019 వరకు విచారణ చేస్తే టీడీపీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు.
Comments
Post a Comment