విద్యుత్ కొనుగోళ్లపై జగన్ ఫోకస్.. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై సమీక్షలు జరుపుతున్న జగన్ సర్కార్.. తాజాగా విద్యుత్ కొనుగోళ్లపై దృష్టి పెట్టింది.టీడీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఈ కమిటీ ఇప్పటికే నివేదిక కూడా అందించగా.. తాజాగా ఓ ఉన్నత స్థాయి కమిటీని జగన్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ కన్వీనర్‌తో పాటు మరో 9మంది కమిటీలో ఉండనున్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,బాలినేని శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం,ఇంధన కార్యదర్శి రావత్ సహా తదితరులు ఇందులో ఉన్నారు.

గత ప్రభుత్వానికి విద్యుత్ అమ్మిన సంస్థలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఏయే రేట్లలో విద్యుత్ విక్రయాలు జరిపారు.. రాష్ట్రానికి ఏయే రేట్లకు విద్యుత్ విక్రయం జరిపారన్న దానిపై కమిటీ ఆరా తీస్తుంది. అలాగే తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు చేసే మార్గాలపై దృష్టి పెట్టనుంది. కుదిరితే ఆ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేలా వారితో సంప్రదింపులు జరపనుంది.

ఇదిలా ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయంపై లోతుగా సమీక్షలు జరుపుతున్న సీఎం జగన్.. విద్యుత్ కొనుగోళ్లలోనూ టీడీపీ సర్కార్ అవకతకవలను బయటపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే టీడీపీ మరోసారి ఇరుకునపడటం ఖాయం అంటున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?