ఇక నుంచి నగదు ఉన్న వ్యాన్లకు సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ :
ఏటీఎంలకు నగదు తీసుకువస్తున్న వ్యాన్లలో దోపిడీలు జరుగుతున్న నేపథ్యంలో ఇక నుంచి నగదు ఉన్న వ్యాన్లకు సీసీటీవీ కెమెరాలు అమర్చాలని కొత్తగా నిర్ణయించారు. నగదు తీసుకువెళుతున్న వ్యాన్లకు ముందూ, వెనుకా, రెండు పక్కల సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. వ్యాన్ క్యాష్ క్యాబిన్ లో కూడా సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలని ఢిల్లీ హోంశాఖ ఆదేశించింది. నగదు తీసుకువస్తున్న వ్యాన్లకు పంచర్లు కాకుండా ట్యూబ్ లెస్ టైర్లను ఏర్పాటు చేయాలని, నగదు బాక్సులకు చైన్లతో ప్రత్యేక తాళాలు వేయాలని హోంశాఖ సూచించింది. వ్యాన్ లో సెక్యూరిటీ అలారంతోపాటు అగ్నిమాపక వాహనం, జీపీఎస్ ట్రాకింగ్ అమర్చాలని ఆదేశించింది. ఒకసారి వ్యానులో రూ.5కోట్లకు మించకుండా రవాణ చేయాలని, సుశిక్షితులైన సెక్యూరిటీ గార్డులను నియమించాలని హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది.
Comments
Post a Comment