జగన్ ప్రధాని అయినా.. ఏపీకి హోదా రాదు.. బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, లేదా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయినా సరే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యంకాదని చెప్పారు. విజయవాడలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదానే కావాలనే పట్టుదలకు పోకుండా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని ఏపీని అభివృద్ధి చేయాలని సూచించారు. టీడీపీ హయాంలో ధర్మపోరాట దీక్షల పేరుతో అధర్మ దీక్షలు చేశారని విమర్శించారు. మరోవైపు రెండేళ్లలో చంద్రబాబునాయుడు జైలుకు వెళతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ధియోదర్ అన్నారు. ఏపీ రాజకీయాలు కొత్తమలుపు తీసుకున్నాయని, వైసీపీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అవుతుందన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?