చిరంజీవితో హృతిక్ రోషన్ వార్.. ‘సైరా’ను టార్గెట్ చేసిన ఇద్దరు హీరోలు..
సైరా సినిమాతో తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు చిరంజీవి. ఆ నమ్మకంతోనే ఇప్పుడు సైరా కోసం 200 కోట్లకు పైగా ఖర్చు చేసాడు రామ్ చరణ్. ఈయన ఓ వైపు రాజమౌళి సినిమాలో నటిస్తూనే మరోవైపు తన తండ్రి సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా కూడా చిత్రయూనిట్ మాత్రం దీనికే ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో చిరంజీవి సినిమాకు ఊహించని షాక్ తగిలింది.
అక్టోబర్ 2న హృతిక్ రోషన్ వార్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. వాణి కపూర్ హీరోయిన్. ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తుంటే అసలు మనం చూస్తున్నది ఇండియన్ సినిమానేనా కాదా అని అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాను ఇప్పుడు సైరా మీదకు పోటీగా విడుదల చేస్తున్నారు యశ్ రాజ్ ఫిల్మ్స్.
రెండు సినిమాలు ఒకేరోజు వస్తే కచ్చితంగా నష్టపోయేది చిరంజీవే. ఎందుకంటే బాలీవుడ్‌లో హృతిక్ సినిమాలకు ఉండే మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య హృతిక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించకపోయినా కూడా ఆయన సినిమాలు హిట్ టాక్ వస్తే మాత్రం రచ్చ చేస్తుంటాయి. మరి చూడాలిక.. ఇప్పుడు చిరంజీవితో హృతిక్ చేయబోయే వార్ ఎలా ఉండబోతుందో..?
Comments
Post a Comment