ఫారెస్ట్ అధికారిణి దాడితో... సార్సాలలో భారీగా మోహరించిన పోలీసులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. నిన్న స్థానిక ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ ఆయన అనుచరులు అటవీ అధికారులపై దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 200 మంది పోలీసులను మోహరించారు. మరోవైపు అటవీ అధికారులు గ్రామంలో మొక్కలు నాటేందుకు సిద్దమయ్యారు. ఇటు ఎమ్మెల్యే అనుచరులు, టిఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ఆందోళనను అధిష్టానం మందలించటంతో విరమించినట్లు తెలుస్తోంది.

దీంతో ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులు భారీగా మోహరించారు. సిఐ నాగిరెడ్డి కూడా ఇక్కడే మకాం వేసి శాంతిభద్రతల వ్యవహారాన్ని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోణప్ప తన సోదరుడుని కాపాడే ప్రయత్నంలో గ్రామస్థులతో సమావేశమైనట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ కోసం అటవీ భూమిని పదును చేసేందుకు వెళ్లిన అటవీ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో సిర్పూర్ ఎమ్మెల్యే కోణప్ప సోదరుడు, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు ఉన్నారు.ఈ దాడిలో ఫారెస్ట్ అధికారిణి అనితకు తీవ్రగాయాలయ్యాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?