త్వరలో 'వన్ నేషన్-వన్ డ్రైవింగ్ లైసెన్స్'

వాహనదారులకు శుభవార్త. త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ రూపురేఖలు మారబోతున్నాయి. ఇకపై దేశమంతా ఒకటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డ్రైవింగ్ లైసెన్స్, వాహన లైసెన్స్‌లు ఒకేలా ఉండబోతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఐడీ, కలర్, భద్రతాపరమైన ఫీచర్స్ ఒకేలా ఉంచాలన్నది కేంద్రం ఆలోచన. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్సులు వేర్వేరుగా ఉన్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కూడా స్మార్ట్ కార్డులా మారిపోనుంది. వాటిలో మైక్రో చిప్, క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. ప్రస్తుతం మెట్రోకార్డ్, ఏటీఎం కార్డ్ ఎలా ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అలాగే ఉంటుంది. దేశమంతా ఒకేతరహా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకురావడం వల్ల నేరాలు తగ్గుతాయని భావిస్తోంది కేంద్రం. అంతేకాదు... ఒకరే రెండు లైసెన్సులు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి ఉల్లంఘనకు చెక్ పెట్టొచ్చన్నది కేంద్రం ఆలోచన.

డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉండే చిప్‌లో సమస్త సమాచారం ఉంటుంది కాబట్టి... ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల వివరాలు తెలుసుకోవడం చాలా సులువు. స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నవాళ్లు మరణానంతరం తమ అవయవాలను దానం చేయడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే వాహనదారులు వెంటనే స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసే సమయంలోనే కొత్త మోడల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం రూ.15-20 మాత్రమే ఖర్చవుతుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?