మంచు లక్ష్మిపై మండిపడుతున్న మహిళా సంఘాలు.. కారణం ఇదే..
మంచు లక్ష్మి మరోసారి వివాదాల్లో ఇరుక్కుంది. ఈమె ఏం చేసినా కూడా ఎక్కడో ఓ చోట కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మరోసారి ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది మంచు వారమ్మాయి. ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించిన లక్ష్మి.. వెబ్ సిరీస్‌ల వైపు చూస్తుంది. మధ్యలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమయంలో ఇప్పుడు సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కూడా అతిథి పాత్రలో మెరిసింది మంచు లక్ష్మి. ఈ మధ్యే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
ఇందులో మంచు వారమ్మాయి కూడా కనిపించింది. సినిమా గురించి.. సమంత గురించి కొన్ని మంచి ముక్కలు చెప్పింది మంచు లక్ష్మి. అక్కడితో ఆగకుండా సినిమాలో ఉన్న ఓ డైలాగ్ కూడా ప్రేక్షకుల కోసం చెప్పింది. ఇదే ఇప్పుడు ఈమెకు తిప్పలు తీసుకొచ్చింది. ఓ బేబీ ట్రైలర్లో నీకు ఎలాంటి మొగుడు కావాలంటే.. అందంగా ఉండాలి.. డబ్బులుండాలి.. మంచమెక్కితే మగాడిలా కాపురం చేయాలంటూ ఓ డైలాగ్ చెబుతుంది. ఇదే డైలాగ్ మంచు లక్ష్మి కూడా చెప్పింది.
ఇదే ఇప్పుడు ఈమెకు చిక్కులు తీసుకొస్తుంది. ఎంత సినిమాలో ఉన్న డైలాగ్ అయినా కూడా అంత పచ్చిగా మంచమెక్కితే మగాడిలా కాపురం చేయాలంటూ ఎలా చెప్తారంటూ ఆమెపై మండి పడుతున్నాయి మహిళా సంఘాలు. వెంటనే ఈమె క్షమాపణ చెప్పాలంటున్నారు వాళ్లు. మొత్తానికి తన ప్రమేయం లేకుండానే వివాదంలో ఇరుక్కుంది ఈమె. నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ సినిమా జులై 5న విడుదల కానుంది.
Comments
Post a Comment