కరెన్సీ నోటును చూడగానే దాని విలువ చెప్పేసే సరికొత్త మొబైల్ యాప్
న్యూఢిల్లీ:
కరెన్సీ నోటును చూడగానే దాని విలువ చెప్పేసే సరికొత్త మొబైల్ యాప్‌ను రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అందుబాటులోకి తీసుకురానుంది.
దేశంలో దృష్టిలోపాలతో బాధపడుతున్న దాదాపు 80 లక్షల మందికి ఇది చేదోడుగా ఉండనుంది.
ఈ అప్లికేషన్‌లోకి లాగిన్ అయి, కెమెరా ఎదుట కరెన్సీ నోటును ఉంచగానే.. దాని విలువ ఎంత అనే దానిపై ఆడియో సందేశం వినిపిస్తుంది.
ఒకవేళ నోటు ఫొటో స్పష్టంగా రాకుంటే ‘మరోసారి ప్రయత్నించండి’ అని సూచన జారీ అవుతుంది.
ఈమేరకు సాంకేతిక పరిజ్ఞానంతో యాప్‌ను అభివృద్ధిపరిచేందుకు ఐటీ కంపెనీల నుంచి ఆర్‌బీఐ బిడ్లు ఆహ్వానించింది.
Comments
Post a Comment